ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆర్య మూవీ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. అప్పట్లో ఆర్య సినిమా క్రియేట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.. అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ తో పాటు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉంటారు. వారి పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఆ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో తెలుసా..?
ప్రస్తుతం ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది హీరోలు హీరోయిన్ లు గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక పై ఫొటోలో ఉన్న చిన్నది శ్రావ్య. ఇప్పటికే శ్రావ్య కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. లవ్ యూ బంగారం సినిమాతో శ్రావ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో సినిమాల నుండి దూరంగా ఉంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ చిన్నదాని లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.