ఇదేందయ్యా ఇది.. ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు అనేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి మెప్పించారు. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేదు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ లో అన్నారు. అవును మహేష్ బాబు కెరీర్ లో నాని, టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అనే చెప్పాలి. ఇక టక్కరి దొంగ విషయానికొస్తే.. సీనియర్ హీరోలందరూ చేసిన తర్వాత కౌబాయ్ సినిమాలు ఇంకెవ్వరూ టచ్ చేయరు అని అనుకునే టైంలో మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ చేసిన సాహసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
ఇక ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు. టక్కరి దొంగలో బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ తో రొమాన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు భామలు గుర్తున్నారా..? వారిలో ఒకరు ఫేమస్ యాక్ట్రెస్ బిపాసా బసు. బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు బిపాసా. మరో హీరోయిన్ గుర్తుందా.? సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. ఆ బ్యూటీ పేరు లిసా రాయ్.
టక్కరి దొంగ సినిమా తర్వాత లిసా రాయ్ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కాగా ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు నెటిజన్స్. లిసా రాయ్ పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మహేష్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.