
సమంత రూత్ ప్రభు నిర్మాతగా తొలి అడుగు వేసిన చిత్రం ‘శుభం’. ఈ సినిమాని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. మే 9, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘శుభం’ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే.. ఒక ఊరిలోని మహిళలు టీవీ సీరియల్స్‌కు అతిగా అలవాటు పడి, ఆ తర్వాత దెయ్యాల్లా ప్రవర్తించడం చుట్టూ కథ నడుస్తుందని అర్థమవుతోంది. ఈ కథాంశం వినోదాత్మకంగా, అదే సమయంలో ఉత్కంఠభరితంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సమంత ఈ చిత్రంలో మాతాజీ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదిలా ఉంటే శుభం సినిమాలో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా.? ఆమె పేరు శ్రియ కొంతం. ఈ చిన్నది గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి మెప్పించింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో ఫేమస్ అయిన ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అరాచకం సృష్టించింది
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శుభం సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ లో ఆమె నటన ఆకట్టుకుంది. ఈ సినిమాతో శ్రియ కొంతం మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ ఈ చిన్నది అవకాశాలు అందుకుందని తెలుస్తుంది. శుభం సినిమాలో దెయ్యం పట్టిన యువతిగా తన నటనతో ఆకట్టుకుంది శ్రియ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి