
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ పలు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఒకనొక దశలో వరుస ప్లాపులతో మహేష్ సతమతమయ్యారు. అలాంటి చిత్రాల్లో అర్జున్ ఒకటి. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలై దాదాపు 20 ఏళ్లు పూర్తైంది. కానీ టీవీల్లో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో తెగ వైరలవుతుంటాయి. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్ కథానాయికగా నటించగా.. రాజా, కీర్తి రెడ్డి కీలకపాత్రలు పోషించారు. అలాగే తనికెళ్ల భరణి, మురళి మోహన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో మరో హైలేట్ పాత్ర ఆండాళ్ ఒకటి. ఈ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ సరిత నటించారు. ఒకప్పుడు తెలుగులో ఆమె తోపు హీరోయిన్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. విలన్ పాత్రలు సైతం పోషించింది. అర్జున్ సినిమాలో ఆండాళ్ పాత్రలో విలన్ నటించింది. ఇందులో తన పాత్రకు ప్రాణం పోసింది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
అయితే సరిత చెల్లెలు సైతం ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఇప్పుడు ఆమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. ఆమె పేరు విజీ చంద్రశేఖర్. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్ర అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. 1991లో వచ్చిన కలియుగం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు. దాదాపు 30ఏళ్లు బ్రేక్ తీసుకున్న ఆమె.. తిరిగి అఖండ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..