Actress Rani: అప్పట్లో ఇండస్ట్రీకి గ్లామర్ క్వీన్.. ఈ నటి కూతురిని చూస్తే మతిపోవాల్సిందే బాసూ..

కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించి శరత్‌కుమార్ నటించిన 'నాట్టమై' చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. అప్పట్లో గ్లామర్ క్వీన్ ఇండస్ట్రీ శాసించిన ఈ నటి కూతురు ఇప్పుడు హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందంలో తల్లిని మించిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Actress Rani: అప్పట్లో ఇండస్ట్రీకి గ్లామర్ క్వీన్.. ఈ నటి కూతురిని చూస్తే మతిపోవాల్సిందే బాసూ..
Actress Rani

Updated on: Dec 18, 2025 | 10:40 AM

ఒకప్పుడు సినిమాల్లో హీరోహీరోయిన్లతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సైతం మంచి గుర్తింపు ఉండేది. వందల చిత్రాల్లో తమ నటనతో అలరించిన నటీనటులకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఒకప్పుడు అలరించిన తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కానీ వారి వారసులు మాత్రం సినీరంగాన్ని ఏలేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కూతురు సినిమాల్లో హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి గుర్తుందా మీకు.. ? తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె పేరు రాణి. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నాట్టమై సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

నటి రాణి 1992లో జానీ వాకర్ సినిమాతో నటిగా మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సహా అనేక భాషల్లో నటించింది. ఇప్పటికీ పలు చిత్రాలు, సీరియల్స్ చేస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె కూతురు సైతం హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. నటి రాణి కూతురి పేరు తర్ణిక. ఆమె తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్, శరత్‌కుమార్ నటించిన పొన్రామ్ దర్శకత్వం వహించిన ‘కొంబు సీవి’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రస్తుతం తర్ణిక లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందంలో అచ్చం తల్లిని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంబు సీవి సినిమా తర్వాత తర్ణికకు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..