సరౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విజయ్ కు, అటు రష్మికాకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత రష్మిక పేరు టాలీవుడ్ లో మారు మారుమ్రోగింది. విజయ్ ఈ మూవీలో ఎంతో ఇనో సెంట్ గా కనిపించి మెప్పించింది. 2018లో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గీతగోవిందం సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు .. ఈ సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ సినిమాలో విజయ్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమాలో విజయ్ ను ప్రేమించిన స్టూడెంట్ గా నటించిన అమ్మాయి గుర్తుందా.? గీతగోవిందం సినిమాలో విజయ్ లెచ్చరర్ గా నటించాడు. అయితే అతన్ని ఇష్టపడే అమ్మాయిగా ఓ యువతి కనిపించింది. ఆమె వల్లే సినిమా కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆమె ఎవరు.? ఏ సినిమాల్లో నటించింది.? ఇప్పుడు ఎలా ఉంది అని నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు.
ఇంతకు ఆమె పేరు అనీషా దామా.. గీతగోవిందం సినిమాలో టీనేజర్ గా కనిపించిన అనీషా దామా ఇప్పుడు హీరోయిన్ గా మారే ప్రయత్నాలు చేస్తోంది. సత్తిగాని రెండెకరాలు అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రేజీ లుక్స్ లో మతిపోగొడుతోంది ఈ చిన్నది. హీరోయిన్స్ ను బీట్ చేసే అందాలతో అదరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.