ఏంటీ.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి మన టాలీవుడ్ హీరోయినా.! స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఆమె..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగులో స్టార్ హీరోయిన్. 2010లో సినీరంగంలో అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. అనేక సవాళ్లను అధిగమించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఏంటీ.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి మన టాలీవుడ్ హీరోయినా.! స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఆమె..
Tollywood Actress

Updated on: Sep 05, 2025 | 5:54 PM

పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు.. ఆమె భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? సినీరంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఇటీవల ఆమె నిర్మాతగా నిర్మించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేక.. మధ్యలోనే చదువులు ఆపేసింది. కానీ ఇప్పుడు ఆమె రూ.100 కోట్ల ఆస్తికి యజమాని. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత. కెరీర్ తొలినాళ్లలో సామ్ ఎక్కువగా యాడ్స్ చేసింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా ఇప్పుడు సామ్ చేసిన ఓ యాడ్ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందలో ఆమె ఓ బ్యూటీ ప్రొడక్టును ప్రమోట్ చేస్తుంది. ఎల్లో కలర్ డ్రెస్ లో నవ్వుతూ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సామ్ ఒకప్పటి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

అప్పుడు కాస్త బొద్దుగా కనిపిస్తుందని.. ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. మొన్నామధ్య సిటాడెల్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్  అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇటీవల నిర్మాతగా మారిన సమంత శుభం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు హీరోయిన్ గాను ఆచితూచి అడుగులేస్తోంది. 2010 తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’తో సమంత తన కెరీర్‌ను ప్రారంభించింది. చిన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉండడంతో చదువు మధ్యలోనే మానేసి సినిమాల్లోకి వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

సమంత ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.