Balu Movie : బాబోయ్..! బాలు సినిమా హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి..!! చూస్తే షాక్ అవుతారు

|

Oct 24, 2024 | 10:07 PM

పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి దూసుకుపోతున్నారు. అలాగే మరో వైపు లైనప్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

Balu Movie : బాబోయ్..! బాలు సినిమా హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి..!! చూస్తే షాక్ అవుతారు
Balu Movie
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. సినిమా ఎలా ఉన్న అందులో పవన్ కళ్యాణ్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. పవర్ స్టార్ సినిమాలకు రిజల్ట్ తో సంబంధం ఉండదు. ఆయనమ్యానరిజం అంటే యువతకు పిచ్చి.. పవన్ చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ ద్దరిల్లుతుంటాయి. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి దూసుకుపోతున్నారు. అలాగే మరో వైపు లైనప్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. కాగా పవన్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమా బాలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, ఆయన యాటిట్యూడ్ కుర్రాళ్లకు వెర్రెక్కించింది.

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

నిజానికి పవన్ సినిమాల్లో పాటలన్ని సూపర్ హిట్స్.. ఏ ఒక్క సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాకే లేదు. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. బాలులో పవన్ స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. సరికొత్త స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్. ఒకప్పుడు పవన్ వేసిన డ్రస్ లకు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే ఆ సినిమాలో పవన్ ఎలా ఉంటారని అందరు ఆతృతగా ఎదురుచూసేవారు. ఇక బాలు సినిమా విషయానికొస్తే. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు చిత్రంలో పవర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు.

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

వారిలో ఒకరు శ్రియ, మరొకరు నేహా ఒబెరాయ్. శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఇక మరొక హీరోయిన్  నేహా ఒబెరాయ్ గురించి మనం మాట్లాడుకోవాలి. నేహా ఈ సినిమా తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది గాలిస్తున్నారు. నేహా తండ్రి ‘ధరమ్ ఒబెరాయ్’ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాతగా రాణించారు. ఆయన వారసురాలిగా నేహా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జగపతిబాబు హీరోగా నటించిన  బ్రహ్మాస్త్రం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

Neha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.