చాల మంది హీరోయిన్స్ కేవలం నటనమాత్రమే కాదు ఇతర ప్రతిభలతోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. నటనలోనే కాదు వివిధ రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కొందరు స్పోర్ట్స్ లో అదరగొడుతుంటే మరికొంతమంది క్లాసిక్ డాన్స్ ల్లో ప్రావిణ్యం చూపుతున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ. డాన్స్ లో ఈ చిన్నదానికి పోటీ ఎవ్వరూ లేరు అనే చెప్పాలి. తన అందంతో నటనతో పాటు డాన్స్ తోనూ కవ్విస్తుంది ఈ చిన్నది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఆమెను ఈజీగా చెప్పొచ్చు. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే..
పై ఫొటోలో అతన అభినయంతో ఆకట్టుకుంటున్న బ్యూటీ ఎవరో కాదు ఆ అమ్మడు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఈ చిన్నది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది. శ్రీలీల కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. ఈ చిన్నది ఓ స్టార్ డాన్సర్.
శ్రీలీల క్లాసికల్ డాన్సర్ కూడా.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా స్టేజ్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతుంది శ్రీలీల. తాజాగా సమతా కుంభ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీలీల స్టేజ్ పర్ఫామెన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేసి ఆకట్టుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది. అలాగే తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంటుంది శ్రీలీల.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.