
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు కానీ మరికొంతమంది మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? టక్కున చూస్తే కనిపెట్టడం కష్టమే కానీ ఆయన చాలా ఫెమస్.. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకూ అతను ఎవరో కనిపెట్టరా.? తాగుబోతు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు ఆ నటుడు.. అబ్బా తమ్ముడు.!! అనే డైలాగ్ తో చాలా పాపులర్ అయ్యాడు.
పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో సినిమాల్లో కమెడియన్ గా రాణించిన నటుడు తాగుబోతు రమేష్.. అలామొదలైంది సినిమాలో ఆయన చేసింది చిన్న పాత్రే అయినా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయింది అది. అబ్బా తమ్ముడు.!! అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు ఆయన. సినిమాల్లో కమెడియన్ గా రాణించిన రమేష్.. ఆతర్వాత జబర్దస్త్ లో స్కిట్స్ చేసి నవ్వించారు. అలాగే పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా నయా లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన బాల్య స్నేహితుడు, దర్శకుడు ప్రభావ్ దర్శకత్వంలో రాబోయే మామ మామ చిత్రంలో మాత అనే రఫ్ అండ్ టఫ్, సీరియస్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ఈ లుక్‌ను ప్రభావ్ డిజైన్ చేశారని, కడప రౌడీ షీటర్ స్లాంగ్‌తో ఆ పాత్ర ఉంటుందని రమేష్ తెలిపాడు. ఈ పాత్ర పూర్తిస్థాయి సీరియస్ క్యారెక్టర్ అని, పుష్ప చిత్రం స్లాంగ్ తరహాలో మామ మామలో తన పాత్రకు ప్రత్యేకమైన యాస ఉంటుందని, ప్రేక్షకులు థియేటర్లలో తన కొత్త లుక్ చూసి షాక్ అవుతారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు రమేష్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..