
ప్రభాస్ నటించిన చిత్రాల్లో వర్షం ఒకటి. ఈశ్వర్, రాఘవేంద్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పింది ఈ మూవీ. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. దివంగత డైరెక్టర్ శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా డార్లింగ్ జోడిగా త్రిష కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, గోపిచంద్, సునీల్, సుమ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఇందులో ప్రభాస్ అక్కగా యాంకర్ సుమ నటించింది. అలాగే ఇందులో డార్లింగ్ మేనల్లుడిగా కనిపించి తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన చిన్నోడు గుర్తున్నాడా.. ? ఈ సినిమాలో ఆ చిన్నోడి పాత్ర చాలా కీలకం. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు.
వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా కనిపించిన పిల్లాడి పేరు అక్షయ్ బచ్చు. వర్షం సినిమాలోనే కాకుండా నాగార్జున, శ్రియా నటించిన సంతోషం మూవీలోని కనిపించాడు. ఇందులో నాగార్జున కొడుకుగా నటించాడు. అంతకు ముందే హిందీలో ఓ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన సంతోషం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వర్షం మూవీలో కనిపించాడు. ఇవే కాకుండా సీరియల్స్ కూడా చేశాడు అక్షయ్. అలాగే దాదాపు 45 యాడ్ ఫిల్మ్స్ చేసి మరింత పాపులర్ అయ్యాడు.
ఇక చదువు కోసం సినిమాలకు దూరమయ్యాడు అక్షయ్. కానీ ప్రస్తుతం అతడు గాయకుడిగా ఉన్నాడు. సినిమాల్లో పలు చిన్న చిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. హిందీలో పలు సినిమాల్లో పాటలు పాడుతూ ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..