Aarti Chabria: ఒకరికి ఒకరు సినిమా హీరోయిన్ గుర్తుందా?ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా? ఫొటోస్ వైరల్

ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోన్నఅతను లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరి ఇదే ఒకరికి ఒకరు సినిమాలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుందాం రండి.

Aarti Chabria: ఒకరికి ఒకరు సినిమా హీరోయిన్ గుర్తుందా?ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా? ఫొటోస్ వైరల్
Okariki Okaru Movie Actress

Updated on: Jun 24, 2025 | 5:29 PM

హీరోలతో పోల్చితే హీరోయిన్ల సినిమా కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు కనిపించకుండా పోయిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. ఇంకొందరు పెళ్లి, పిల్లలు లేదా ఇతర కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతారు. హీరోయిన్ ఆర్తి ఛాబ్రియా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. శ్రీరామ్‌ హీరోగా వచ్చిన ‘ఒకరికి ఒకరు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇందులో ఆమె పోషించిన సుబ్బలక్ష్మి పాత్ర చాలా మందికి గుర్తుండిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రసూర్‌ ఎల్లోర్‌ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌ స్టోరీ అప్పట్లో ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అలాగే ఆర్తి అందం, అభినయం యూత్ కు తెగ నచ్చేశాయి. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత మధురక్షణం అనే తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి లోకి అడుగు పెట్టింది. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చింతకాయల రవి, గోపి- గోడమీద పిల్లి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక హిందీలో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, రాజా భయ్యా, షాదీ నంబర్‌వన్‌, హే బేబీ వంటి హిట్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఆర్తి.

2013 తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది ఆర్తి ఛాబ్రియా. ఆ తర్వాత 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలోనే స్థిర పడింది. సినిమాలకు దూరంగా ఉన్న ఆర్తి ప్రస్తుతం విక్టోరియస్‌ మైండ్‌ పవర్‌ అనే ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్లాట్‌ ఫామ్ కు ఫౌండర్‌గా వ్యవహరిస్తుంది. అలాగే మోటివేషనల్ క్లాసులు కూడా తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఆర్తి ఛాబ్రియా లేటెస్ట్ ఫొటోస్..

ఆర్తి సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంటుంది. అలా ఇటీవల ఆమె షేర్ చేసిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ‘ఆర్తి అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి