
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన రెండో సినిమా ఇది.. ఈ సినిమా కంటే ముందు విడుదలైన హరిహరవీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వచ్చిన ఓజీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇటీవలే పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కు కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దర్శకుడు సుజీత్‌కు పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను ఎందుకు బహుమతిగా ఇచ్చారో తెలుసా..? అసలు విషయం తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు. చాలామంది ‘OG’ సినిమా ఘనవిజయం సాధించడంతో పవన్ కారును బహుమతిగా ఇచ్చారని అనుకున్నారు. అయితే నిజమైన కారణం ఏంటంటే.. ఓజీ చిత్రం షూటింగ్ చివరి దశలో ఒక కీలక షెడ్యూల్‌ను జపాన్‌లో చిత్రీకరించాల్సి ఉందట. బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాతలు ఈ ఓవర్సీస్ షెడ్యూల్‌కు డబ్బులు లేవని చెప్పారట. ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తేనే సినిమా పూర్తి అవుతుందని గట్టిగా నమ్మిన సుజీత్, దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారట.
దాంతో సుజిత్ తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను అమ్మేసి ఆ డబ్బుతో జపాన్‌కు వెళ్లి అవసరమైన సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ విషయం సినిమా డబ్బింగ్ దశలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందట. సినిమా పట్ల సుజీత్ చూపిన అంకితభావం, ప్యాషన్, బాధ్యతాయుతమైన త్యాగానికి ఎంతో ముచ్చటపడిన పవన్ కళ్యాణ్, ఆయన అమ్మేసిన అదే మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కొని మళ్లీ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారట. అందుకే సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ బహుమతిగా అందజేశారు పవన్ కళ్యాణ్. అంతే కాదు ఈ ఖరీదైన కారు EMIలను కూడా పవన్ కళ్యాణ్ కడుతున్నారట. పవన్ కళ్యాణ్ గొప్ప మనసుకు ఇదొక ఉదాహరణ.. ఈ విషయం తెలిసి పవన్ అభిమానులు ఆయనను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.