అప్పట్లో టీచర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రాకముందు వివిధ రంగాల్లో రాణించారు.. ఆ తర్వాత హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆతర్వాత సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా కెరీర్ బిగినింగ్ లో టీచర్ గా చేసింది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

అప్పట్లో టీచర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే
Tollywood Actress

Updated on: Jun 15, 2025 | 12:08 PM

సాధారణంగా అభిమానులు తమకు ఇష్టమైన చిన్ననాటి చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. పైన ఫోటోలో కనిపించే అమాయకమైన చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు.. ఆమె భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు టీచర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. రీసెంట్ డేస్ లో భారీ హిట్స్ అందుకుంది ఆమె.. ఆమె నటించిన సినిమాలు ఏకంగా రూ. 2000కోట్ల వరకు వసూల్ చేశాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది. ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అరుంధతి (2009), ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు వంటివి లభించాయి.

ఇవి కూడా చదవండి

అనుష్క బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ చిత్రాలు ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి. ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి (2015), సైజ్ జీరో (2015), భాగమతి (2018) వంటివి ఉన్నాయి. అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్‌గా చేసింది. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది. త్వరలోనే అనుష్క ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.