వారెవ్వా..! ఈ హీరోయిన్.. మహేష్ బాబు అతిథి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా.!! ఎంత మారిపోయింది

టాలీవుడ్‌‌లో క్లాసిక్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డికి పేరుంది. అయితే బ్లాక్ బాస్టర్.. లేదంటే అట్టర్ ప్లాఫ్. ప్రముఖ దర్శకుడు.‘కిక్‌’ సినిమాతో భారీగా వసూళ్లు రాబట్టాడు. మహేశ్ బాబుతో సురేంద్ర రెడ్డి తీసిన అతిథి సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే సినిమాలోని కొన్ని రోల్స్ మాత్రం ఆడియెన్స్‌కు ఇప్పటికీ గుర్తుంటాయి.

వారెవ్వా..! ఈ హీరోయిన్.. మహేష్ బాబు అతిథి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా.!! ఎంత మారిపోయింది
Mahesh Babu Athidhi

Updated on: May 31, 2026 | 4:39 PM

సూపర్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన సూపర్ స్టైలిష్ మూవీ అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. కానీ ఈ సినిమాకు ఉన్న క్రేజే వేరు..

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే అతిథి సినిమా రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సందడి చేసింది. మరోసారి అతిథి సినిమాను థియేటర్స్ లో చూసి తెగ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

ఈక్రమంలో అతిథి సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అతిథి సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా.! ఆమె ఇప్పుడు హీరోయిన్.. ఆమె మరెవరో కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ అనీ.. ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆమె చిరంజీవి నటించిన స్టాలిన్, మహేష్ బాబు అతిది, స్వాగతం, ప్రభాస్ ఏక్ నిరంజన్, రాజన్న వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. అనీ ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

చైల్డ్ ఆర్టిస్ట్ అనీ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

చైల్డ్ ఆర్టిస్ట్ అనీ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us