
ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తమను తాము నిరూపించుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. తక్కువ సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకటి , రెండు సినిమాలతోనే పాపులర్ అయిన బ్యూటీలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ యూత్ లో విపరీతమైన క్రేజ్. కుర్రాలంతా ఆమె జపమే చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలో నటించలేదు.. ఎక్కువ సినిమాలు చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్ ను మించి పాపులర్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
దివ్య భారతి.. చేసింది రెండు సినిమాలే.. ఒక సినిమాలో చిన్న రోల్ చేసింది. కట్ చేస్తే.. కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. ‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే ‘కింగ్‌స్టన్’ చిత్రంలో నటించింది.
1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మాడి ఖాతాలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇప్పటికీ చాట్‌బస్టర్‌గా మారింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి