
సాధారణంగా స్క్రీన్ పై అందం, అభినయంతో మెప్పించే తారల జీవితాలు సవాళ్లతో కూడుకుంటాయి. రంగుల ప్రపంచంలో నటీనటులుగా ఓ వెలుగు వెలిగినప్పటికీ రాత్రికి రాత్రే ప్రతిదీ మారిపోతుంది. ఒక్క సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని సెన్సేషన్ అవుతుంటారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ కోట్లాది మంది జనాల హృదయాలను గెలుచుకుంటారు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమవుతుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. 16 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే కట్టిపడేసింది. చూడచక్కని రూపం..అద్భుతమైన నటనతో సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది.
కానీ ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితానికి ముగింపు పలికింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్ ఆర్తి అగర్వాల్. గుజరాజ్ ప్రాంతానికి చెందిన ఆమె.. 2001లో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించిన పాగల్పన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అదే ఏడాది వెంకటేశ్ నటించిన నువ్వు నాక్ నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆర్తి అగర్వాల్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో యూత్ ఫేవరేట్ హీరోయిన్.
నువ్వు నాకు నచ్చావ్ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ నాగార్జున, రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, తరుణ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే స్పెషల్ పాటలతోనూ రచ్చ చేసింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే తక్కువ సమయంలోనే వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆర్తి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె గురించి పలు వార్తలు వినిపించాయి. ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. అదే సమయంలో 2005లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత అదే ఏడాది మెట్లపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .