నాలుగు సినిమాలు చేస్తే మూడు బ్లాక్ బస్టర్స్.. ఒకటి అట్టర్ ఫ్లాప్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా మారారు. ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ కూడా చేసిన ఒక్క సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.

నాలుగు సినిమాలు చేస్తే మూడు బ్లాక్ బస్టర్స్.. ఒకటి అట్టర్ ఫ్లాప్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Tollywood Actress

Updated on: Jun 05, 2025 | 4:29 PM

ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర భాషల నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ చేసింది నాలుగు సినిమాలు అందులో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

టాలీవుడ్ లోకి కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా మంది భామలు వచ్చారు. తక్కువ సమయంలోనే స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. ఆమె ఎవరో కాదు రీసెంట్ గా నానితో కలిసి హిట్ అందుకున్న శ్రీనిధి శెట్టి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏకంగా 800కోట్లకు పైగా వసూల్ చేసింది. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

కేజీఎఫ్ 2 సినిమా కూడా భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 సినిమా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్ లో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్ట్ గా అడుగుపెట్టింది. హిట్ 3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా దాదాపు 400కోట్ల వరకు వసూల్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.