ఆరు సినిమాలు చేస్తే.. ఒక్క హిట్ కూడా అందుకోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఊపేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంతమంది భామలు.

ఆరు సినిమాలు చేస్తే.. ఒక్క హిట్ కూడా అందుకోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఊపేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Actress

Updated on: May 02, 2025 | 5:10 PM

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. అలాగే మరికొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతున్నారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా వరుస సినిమాలతో బిజీగా మారింది. కానీ కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. కానీ కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు తమిళ్ సినిమాల్లో నటించిన కూడా ఈ అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు. అంతే కాదు ఓ హిందీ సినిమాలోనూ గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు..

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ డింపుల్ హయతి. ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును తన వలలో పడేసింది. ఈ భామ గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. టు బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగులో వరుసగా యురేక, అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ , ఖిలాడి, రామబాణం సినిమాల్లో నటించింది. అంతే కాదు గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో తన అందంతో కవ్వించింది.

తమిళ్ లో ఈ చిన్నది దేవి 2, సామాన్యుడు (విశాల్ నటించిన సినిమా), సినిమాలతో పలకరించింది. కానీ ఈ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. శ‌ర్వానంద్ – సంప‌త్‌నంది కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా డింపుల్ హయతి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పైనే ఈ చిన్నది ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.