Telugu News Entertainment Tollywood Do you know who this heroine is, she has only got one hit despite doing films in Tollywood and Bollywood? She is Seerat Kapoor
తెలుగు, హిందీ రెండు ఇండస్ట్రీలు కలిసి రాలేదు.. 12 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్ ల్లో బిజీ అయిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అందం అభినయం ఉండి సినిమాలకు దూరం అయినవారు ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి
చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రం ఒకటి రెండు మాత్రమే.. హిందీలోనూ ట్రై చేసింది కానీ .. అక్కడా లాభం లేకుండా పోయింది. దాంతో సోషల్ మీడియాలో అరాచకం చేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది.
అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు. ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఆతర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది. రన్ రాజా రన్ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది..కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.