అమ్మబాబోయ్..! బీభత్సం..!! రవితేజ సినిమాలో ఊపేసిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు.

అమ్మబాబోయ్..! బీభత్సం..!! రవితేజ సినిమాలో ఊపేసిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
Bhartha Mahasayulaku Wignyapthi

Updated on: Jan 22, 2026 | 5:27 PM

మాస్ మహారాజ రవితేజ హీరోగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకంగా పేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. భారీ హిట్ అందుకోకపోయినా ఓమాదిరి హిట్ సొంతంక్ చేసుకుంది  తిరుమల కిషోర్ దర్శకత్వం సినిమా.. ఈ పండగకు నాలుగు సినిమాలతో పోటీ పడింది ఈ సినిమా. అయినప్పటికీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా క్రేజీ బ్యూటీస్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు.

జనవరి 13న విడుదలైన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇక ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా కార్తీకదీపం సాంగ్ ను రీమిక్స్ చేశారు సినిమాలో.. డీజే వర్షన్ లో ఈ సాంగ్ ను సినిమాలో వాడుకున్నారు. ఈ సాంగ్ లో రవితేజ డాన్స్ తో అదరగొట్టారు. రవితేజతో పాటు ఆషిక కూడా స్టెప్పులతో కుమ్మేసింది. వీరితో పాటు ప్రేక్షకులను మరో బ్యూటీ కూడా ఆకర్షించింది.

రవితేజ వెనక డాన్స్ చేస్తున్న ఓ చిన్నది తన అందంతో కుర్రాళ్ళ దృష్టిని ఆకర్షించింది. ఆమె డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె అందానికి కుర్రాళ్ల పడిపోయారు. పై ఫొటోలో కనిపిస్తున్న భామ ఎవరో తెలుసా.? ఆమె పేరు ఎడిన్ రోజ్. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. గతంలో రవితేజ నటించిన రావణాసుర సినిమాలోనూ కనిపించింది. అలాగే ఎల్ఐకే అనే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్ సీజన్ 18లోనూ పాల్గొంది. ఇక ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఐడీ కోసం నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కవ్విస్తుంది. ఈ బ్యూటీ క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సాంగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..