Baby Movie: బేబీ మూవీ క్లైమాక్స్‌లో వచ్చిన నటుడు గుర్తున్నాడా.? ఓ స్టార్ డైరెక్టర్ తమ్ముడు అతను

|

Aug 15, 2024 | 2:25 PM

7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఆహా ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిస్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బేబీ సినిమాకు క్లైమాక్స్‌ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్‌, విరాజ్‌లను కాదని హీరోయిన్‌ వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది.

Baby Movie: బేబీ మూవీ క్లైమాక్స్‌లో వచ్చిన నటుడు గుర్తున్నాడా.? ఓ స్టార్ డైరెక్టర్ తమ్ముడు అతను
Follow us on

గత ఏడాది అతిపెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల్లో వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమా ముందుంటుంది. సాయి రాజేష్‌ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలు పోషించారు.  7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఆహా ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిస్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బేబీ సినిమాకు క్లైమాక్స్‌ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్‌, విరాజ్‌లను కాదని హీరోయిన్‌ వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అతను ఆ ఒక్క షాట్‌లో మాత్రమే కనిపించినా తెగ ఫేమస్‌ అయిపోయాడు.

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

సోషల్‌ మీడియాలోనూ ఈ పెళ్లి కొడుకు గురించి మార్మోగిపోయింది. అతనిపై మీమ్స్‌ కూడా తెగ వైరల్‌ అయిపోయాయి. అదే సమయంలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఎవరా.? అని చాలామంది ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో ఓ టీవీ షోలో తళుక్కున మెరిశాడీ నటుడు. దీంతో అతను ఎవరు.? బ్యాగ్రౌండ్‌ ఏమిటి.? తదితర విషయాలు తెలిశాయి. అతని పేరు మల్లిడి కృష్ణ. బేబీ కన్నా ముందే పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. ముఖ్యంగా బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ నిర్మించిన కలర్‌ ఫొటో సినిమాలో హీరో సుహాస్‌కు సీనియర్‌గా కనిపిస్తాడు. అయితే చాలా సినిమాలు చేసినా కృష్ణకు సరైన బ్రేక్‌ రాలేదు.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

అయితే బేబీ సినిమాలో ఒక్క పెళ్లి సీన్‌లో నటించి తెగ పాపులర్‌ అయిపోయాడు కృష్ణ మల్లిడి. ఇక ఈ యాక్టర్‌ మరెవరో కాదు.. కల్యాణ్‌ రామ్‌తో బింబిసారాలాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన మల్లిడి వశిష్టకి సోదరుడట. వశిష్ట తండ్రి గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలా సినీ ఫ్యామిలీ నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచే కృష్ణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్టార్‌ యాంకర్‌తో విష్ణుప్రియతో దిగిన పలు ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె కూడా కృష్ణకు రిలేటివ్ అవుతుందిని తెలుస్తోంది. కొంతమంది వారిద్దరు స్నేహితులు అంటుంటే, మరికొందరు దగ్గరి బంధువులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వశిష్ట మల్లిడి ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..