ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..? అతని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

|

Apr 24, 2024 | 5:49 PM

ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు.

ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..? అతని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Om Bheem Bush
Follow us on

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. కామెడీ హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో సంపంగి దెయ్యం పాత్రలో నటించింది ఎవరో తెలుసా.? సినిమాలో సంపంగి దెయ్యం పాత్ర హైలైట్ అనే చెప్పాలి. అంతే కాదు ఈ సినిమాలో శ్రీవిష్ణులు సంపంగి దెయ్యానికి మధ్య ఓ బ్యూటీఫుల్ మెలోడీ కూడా ఉంటుంది. ఈ దెయ్యం పాత్ర మొదట్లో నవ్వించినా.. చివర్లో మాత్రం ఎమోషనల్ అయ్యేలా చేసింది.

ఇక ఈ సంపంగి దెయ్యం పాత్రలో నటించింది ఎవరో తెలుసా..? అతని పేరు మనీష్ కుమార్. మనీష్ కుమార్ ఓ క్లాసిక్ డాన్సర్. అందుకే ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నటించి అద్భుతంగా డాన్స్ చేశాడు మనీష్ కుమార్. ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మనీష్ కుమార్. మనీష్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇతని కోసం నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంపంగి దెయ్యం ఇతనే అంటూ మనీష్ ఫోటోలు షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

మనీష్ కుమార్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.