Tollywood: ఉంగరాల జుట్టు.. నాజూకు వయ్యారాలు.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

|

Jan 20, 2023 | 11:47 AM

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత ఎన్నో మంచి ఆఫర్లను..

Tollywood: ఉంగరాల జుట్టు.. నాజూకు వయ్యారాలు.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Heroine
Follow us on

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత ఎన్నో మంచి ఆఫర్లను దక్కించుకుంది ఈ అందాల భామ. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగు డైరెక్టర్లపై ఆమె చేసిన పలు కాంట్రవర్సీ కామెంట్స్‌తో అవకాశాలు తగ్గాయి. అయితేనేం హిందీలో వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటూ.. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఈ బ్యూటీ. మరి ఆమెవరో గుర్తుపట్టారా.?

సరే..! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు ఇంకా గుర్తురాకపోతే..! మీకో చిన్న క్లూ.. తెలుగులోకి 2010లో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘మిస్టర్ పర్ఫెక్ట్’తో హిట్ కొట్టింది. అదే కరెక్ట్.! ఆమెవరో కాదు తాప్సీ. కెరీర్‌లో 45కి పైగా చిత్రాల్లో నటించిన ఈమె.. పలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

‘గుండెల్లో గోదారి’, ‘సాహసం’, ‘కాంచన 2’, ‘ఘాజి’, ‘ఆనందో బ్రహ్మ’, ‘జుద్వా 2’, ‘నీవెవరో’, ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’, ‘మిషన్ మంగళ్’, ‘తప్పడ్’, ‘హసీనా దిల్రుబా’, ‘శభాష్ మిథు’, ‘దోబారా’, ‘బ్లర్’ లాంటి సినిమాల్లో నటనకు గానూ తాప్సీకి మంచి మార్కులు పడ్డాయి. కాగా, ప్రస్తుతం తమిళంలో ‘జనగణమన’, ‘ఎలియన్’.. హిందీలో ‘వో లడకీ హై కహానీ’, ‘దుంకి’, ‘ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా’ చిత్రాల్లో నటిస్తోంది తాప్సీ.