Actress: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Dec 26, 2024 | 9:25 PM

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా.. ఏది అనుకోనమ్మా నీ చిరునామా.. అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్ మీకు గుర్తుందా.. ఈ సాంగ్ ఇప్పటికీ 90s కిడ్స్‌కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇందులో సుబ్బలక్ష్మీ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ గుర్తుందా..

Actress: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us on

కొందరి హీరోయిన్లను కొన్ని సినిమాలతోనే గుర్తుంచుకోగలం. ఆ సినిమాలు క్లాసిక్ హిట్స్ మాత్రమే కాదు.. వారి కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చినట్టువంటివి అయి ఉంటాయి. కొందరు హీరోయిన్లు అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు.. పెళ్లి, పిల్లలు.. లేదా ఇతరత్రా కారణాలతో ఇండస్ట్రీని వదిలిపెడుతుంటారు. అలా తెలుగులో కేవలం ఐదు చిత్రాలు మాత్రమే చేసి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి చాబ్రియా. ఇలా పేరు చెబితే మీరు గుర్తుపట్టకపోవచ్చు. ‘ఎక్కడున్నావమ్మా.. ఓ ప్రియతమా.. ఏది అనుకోనమ్మా నీ చిరునామా’ అంటూ మంచి ఫీల్ గుడ్ సాంగ్‌ మీకు గుర్తుందా.? అందులో కనిపించిన సుబ్బలక్ష్మీ.. ఈ ముద్దుగుమ్మ. రసూర్ ఎల్లోర్ తెరకెక్కించిన ‘ఒకరికి ఒకరు’ సినిమా అప్పట్లో ఓ క్రేజీ మూవీ అని చెప్పొచ్చు. సినిమా సోసోగానే ఆడినా.. ఇందులోని ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా..’, ‘నువ్వే నా శ్వాస.. నీకై అభిలాష’ పాటలు మాత్రం 90s కిడ్స్‌కి ఇప్పటికీ ఫేవరెట్ సాంగ్స్. ఈ సినిమాలో హీరోయిన్‌లో హీరోయిన్‌గా నటించిన ఆర్తి చాబ్రియా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. అందం, అభినయంతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చింతకాయల రవి, గోపి- గోడమీద పిల్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారింది.

ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. 2001లో అటు హిందీలో ‘లజ్జ’ అనే చిత్రంతో.. తెలుగులో ‘మధురక్షణం’ అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీలో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, రాజా భయ్యా, షాదీ నంబర్‌వన్‌, హే బేబీ, పార్టనర్, డాడీ కూల్, మిలేంగే మిలేంగే చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చింతకాయల రవి, గోపి- గోడమీద పిల్లి సినిమాల్లో నటించి మెప్పించింది. 2013లో సినిమాలకు దూరమైన ఈ భామ.. 2017లో ‘ముంబై-వారణాసి ఎక్స్‌ప్రెస్’ అనే షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించడమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరించింది.

‘ఫియర్ ఫాక్టర్’, ‘జలక్ దిఖ్‌ల జా-6’, ‘దర్ సబకో లగ్తా హై’ లాంటి టెలివిజన్ సిరీస్‌ల్లో నటించింది. ఈ అమ్మడు 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌ విశారద్‌ను పెళ్లాడి.. తన మకాం ఆస్ట్రేలియాకు షిఫ్ట్ చేసుకుంది. అప్పుడప్పుడూ ఇండియా వస్తూ.. వెళ్తూ ఉంది. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా ఫేమస్ అయిన ఈ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ‘విక్టోరియస్‌ మైండ్‌ పవర్‌’ అనే ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్లాట్‌‌ఫామ్‌కు ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది. తరచూ తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తోంది ఈ భామ. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి