అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ సూపర్ హిట్ గా మాత్రం నిలవలేదు. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యింది. నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో అలనాటి అందాల తార రాధా కూతురు కార్తీక నటించింది. జోష్ సినిమాలో నాగచైతన్య చాల మెచ్యూర్ గా నటించాడు. అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జోష్ సినిమా నాగార్జున శివ సినిమా మాదిరిగానే ఉంటుంది. జోష్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ సుమారు రూ 17.5 కోట్లు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ . 19.5 కోట్ల వరకు జరిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా మరో హీరోను ఎంపిక చేశారట. ఆయన కూడా ఓ స్టార్ హీరో కొడుకు.
జోష్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ముందుగా ఈ సినిమాను దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలనీ అనుకున్నారట. ఈ మేరకు కథను కూడా చరణ్ కు వినిపించారట. చరణ్ ఓకే చేసినా చిరంజీవి కారణంగా ఆ ప్రాజెక్ట్ నాగ చైతన్యకు దక్కిందట.
జోష్ సమయానికి దిల్ రాజు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే అప్పుడే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్తబంగారు లోకం అనే సినిమా తో నాగ చైతన్యను పరిచయం చేయాలనుకున్నారు దిల్ రాజు. ఇదే విషయం నాగార్జున కు చెప్తే తన కొడుకు ఎంట్రీ భారీ సినిమాతో ఉండాలని అన్నారట. దాంతో ఆ కథ వరుణ్ సందేశ్ కు వెళ్ళింది. ఆతర్వాత దిల్ రాజు జోష్ కథను చరణ్ కు వినిపించగా అతను ఓకే చేసిన చిరంజీవి మాత్రం నో చెప్పారట. అప్పటికే రామ్ చరణ్ మగధీర సినిమా చేస్తున్నాడు. అంత పెద్ద సినిమా సమయంలో జోష్ సినిమా కరెక్ట్ కాదని చిరు భావించారట. దాంతో దిల్ రాజు జోష్ కథను నాగార్జునకు వినిపించగా శివ సినిమా పోలికలతో ఉండటంతో వెంటనే ఓకే చేశారట నాగ్. అలా చరణ్ చేయాల్సిన జోష్ నాగ చైతన్యకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.