దళపతి విజయ్ నటించిన లియో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తొలి షో నుంచే లియో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య లియో అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. లియో సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని ఆదుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ లియో సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో సినిమా మంచి వసూల్ చేసింది. దాదాపు 16 కోట్ల వరకు వసూల్ చేసింది.
లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన గత సినిమాలు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు. ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు. లియో రిలీజ్ తర్వాత ఆ అంచనాలు అందుకుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు . అనిరుధ్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇప్పుడు లియో మూవీ ఓటీటీ పార్ట్నర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. లియో సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను దీపావళి తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నవంబర్ మూడో వారంలో లియో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Overseas Top Day 1 openings Tamil movies –#Leo – $8M
Kabali – $6.5M
Ponniyin Selvan – $5.1M
Jailer – $4.8M
Ponniyin Selvan 2 – $4.1M
Bigil – $3.8M pic.twitter.com/P4BdyAj6S9— AB George (@AbGeorge_) October 20, 2023
#LEO goes past #Vikram to mark the biggest opening day at #URCinemas 🔥 He is a freaking badass 🥵 Next opening weekend ⌛️ #LEOatRajendra pic.twitter.com/USWZwsmvIb
— Umaa Rajendra Cinemas (@UmaaRajendra) October 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి