Rajinikanth: రజినీకాంత్‏కు లవర్‏గా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..

దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఒక్క హీరోతో మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించింది. అతడి సరసన ప్రియురాలిగా, అత్త, తల్లి, చెల్లి పాత్రలలో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Rajinikanth: రజినీకాంత్‏కు లవర్‏గా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..
Rajinikanth

Updated on: May 25, 2025 | 2:27 PM

సాధారణంగా సినీరంగంలో కొందరు హీరోహీరోయిన్స్ జోడి ఎవర్ గ్రీన్ హిట్ గా ఉంటుంది. వారి కాంబోలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ జోడిలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మొదట్లో హీరోకు జోడిగా నటించిన హీరోయిన్స్ ఆ తర్వాత అదే హీరోకు తల్లిగా, చెల్లిగా, అత్తగా నటించారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం.. ఒకే హీరో సినిమాలో పలు పాత్రలు పోషించారు.ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఏడు పదుల వయసులోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీ.

ఇదిలా ఉంటే రజినీకి చెల్లిగా, తల్లిగా, అత్తగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ శ్రీవిద్య. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్రీవిద్య. ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి , ఎంఎల్ నటి శ్రీవిద్య వసంత కుమారి దంపతుల కుమార్తె శ్రీవిద్య. ఆమె జన్మించిన సంవత్సరానికే ఒక ప్రమాదంలో కృష్ణమూర్తి మరణించారు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యలు తగ్గించేందుకు శ్రీవిద్య 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తిరువరుట్చెల్వన్ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన శ్రీవిద్య.. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. దర్శకురాలు కె. శ్రీవిద్య బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఇందులో రజినీ ప్రియురాలిగా కనిపించింది శ్రీవిద్య.

ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీవిద్య.. 14 ఏళ్ల తర్వాత 1989 చిత్రం ‘మాప్పిళ్ళై’లో రజనీకాంత్ అత్తగా నటించింది. రెండేళ్లకు రజినీ, మణిరత్నం కాంబోలో వచ్చిన దళపతి చిత్రంలో రజినీ తల్లిగా నటించింది. ఇక 1993లో విడుదలైన అతురువతలి చిత్రంలో రజినీ సోదరిగా కనిపించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రజినీకి ప్రియురాలిగా, అత్త, తల్లి, చెల్లిగా నటించింది.

Srividya

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..