Samarasimha Reddy: బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

సంక్రాంతి పండగ వస్తే చాలు బాలయ్య సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఇక బాలయ్య సమరసింహారెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.

Samarasimha Reddy: బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
Samarasimha Reddy

Updated on: Jun 04, 2023 | 1:02 PM

నటసింహంనందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బాలయ్య సినిమా అంటే మాములుగా ఉండదు మరి. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. సంక్రాంతి పండగ వస్తే చాలు బాలయ్య సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఇక బాలయ్య సమరసింహారెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. సిమ్రాన్, అంజలా జవేరీ, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సమరసింహారెడ్డి 1999లో విడుదలైంది ఈ సినిమా.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో సమరసింహారెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా 16 నుండి 17 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ముందుగా బాలయ్య చేయాల్సింది కాదట. విక్టరీ వెంకటేష్ తో ఈ సినిమాని చేద్దాం అనుకున్నారట డైరెక్టర్ బి గోపాల్. అయితే వెంకటేష్ కు కథ నచ్చిందట. కానీ అలాంటి సినిమాలు తనకు సూట్ కావు అని చిరంజీవి లేదా బాలయ్యతో చేయమని సలహా ఇచ్చారట. అయితే బాలయ్య నటించిన సమరసింహారెడ్డి భారీ విజయం సాధించడంతో వెంకటేష్ మంచి సినిమా మిస్ చేసుకున్నా అనుకున్నారట. ఆ తర్వాత ఎన్. శంకర్ అనే దర్శకుడు ‘జయం మనదిరా’  అని సినిమా కథ చెప్పడంతో ఈ యాక్షన్ సినిమాను మిస్ చేసుకోకూడదని వెంటనే ఒప్పుకున్నారట. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Venkatesh