Tollywood: సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారాల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

|

Jan 18, 2023 | 11:01 AM

ఇప్పుడు చెప్పబోయే నటికి అందం, అభినయం రెండూ ఉన్నాయి. కానీ అదృష్టం మాత్రం తక్కువే. తన నటనతో ప్రేక్షకులను అలరించినా..

Tollywood: సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారాల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Heroine
Follow us on

అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా తోడైతేనే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంతోకాలం కొనసాగవచ్చు. అలా ఇండస్ట్రీని ఏలిన నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే నటికి అందం, అభినయం రెండూ ఉన్నాయి. కానీ అదృష్టం మాత్రం తక్కువే. తన నటనతో ప్రేక్షకులను అలరించినా.. అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. 2008లోనే టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె.. మళ్లీ మరో ఛాన్స్ కోసం ఏకంగా ఆరేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో చేసిన చిత్రం సూపర్ హిట్ అందుకున్నా ఆఫర్లు మాత్రం ఈ బ్యూటీ తలుపు తట్టలేదు. అప్పుడప్పుడూ ఒకటో రెండో సినిమాల్లో కనిపించినా.. గుర్తింపు మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే కన్నడం, తమిళ, హిందీ భాషల్లోనూ అరంగేట్రం చేసింది. మరి ఆమెవరో గుర్తుపట్టగలరా.?

మీకు ఇప్పటికీ ఆమెవరో తెలియకపోతే.. చిన్న క్లూ.. ఈ అందాల భామ నందమూరి బాలకృష్ణతో కలిసి ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది. బికినీ షోతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. హా.. ఎస్.. మీ గెస్ కరెక్టే.. మరెవరో కాదు సోనాల్ చౌహాన్. 2008లో అటు ‘జన్నత్’ సినిమాతో హిందీలో.. ఇటు ‘రెయిన్ బో’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. 2014లో ‘లెజెండ్’ మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’, ‘ఎఫ్ 3’, ‘ఘోస్ట్’ లాంటి చిత్రాలతో తన నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ. ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ.. అభిమానులకు మరింత దగ్గరగా ఉంటోంది.