
‘ఆశ్రమ్’ బోల్డ్ వెబ్‌సిరీస్.. కరోనా టైంలో ఇదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సిరీస్ మూడు సీజన్లు విడుదల కాగా.. అవన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. బాబీ డియాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో బబిత పాత్రలో కనిపించింది త్రిధా చౌదరి. బాబీ డియాల్, త్రిధా చౌదరీ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆ టైంలో పెద్ద రచ్చ చేశాయి. అటు తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన త్రిధా.. వాటి కంటే ఈ బోల్డ్ వెబ్ సిరీస్.. ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది.
‘దహ్లీజ్’ అనే టీవీ షో ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించింది త్రిధా.. ఆ తర్వాత బెంగాలీ, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో సూర్య వర్సస్ సూర్య, అనుకున్నది ఒకటి అయ్యిందోకటి, మనసుకు నచ్చింది లాంటి సినిమాలలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అటు ‘బందిష్ బందిపోటు’, ‘ఆశ్రమ్’ లాంటి సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌లు చేసింది త్రిధా చౌదరి. ఈ భామకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. కరోనా సమయంలో విడుదలైన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆ సిరీస్‌లో బాబీ డియోల్‌తో చేసిన ఇంటిమేట్ సీన్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాగా, త్రిధా చౌదరి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదొక ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాగే డిఫరెంట్ ప్లేస్‌లు ఎక్స్ ప్లోర్ చేస్తుంది. ఇక తన వెకేషన్ చిత్రాలు, బికీనీ పోజులతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోలను మీరూ చూసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.