జెంటిల్‌మెన్ సినిమాలో మెరిసిన ఈ వయ్యారి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో చూశారా.!

|

Aug 08, 2024 | 1:40 PM

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈమె హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ స్పెషల్ సాంగ్స్ మెరిసింది. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జెంటిల్‌మెన్ సినిమాలో మెరిసిన ఈ వయ్యారి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో చూశారా.!
Tollywood
Follow us on

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈమె హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ స్పెషల్ సాంగ్స్ మెరిసింది. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అజిత్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమలేఖ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్ సినిమాలో ‘చిన్నదానా ఓసి చిన్నదానా’ అనే సాంగ్‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఆమె గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ హీరోయిన్ అసలు పేరు రాణి కాగా.. సినిమాల్లోకి వచ్చాక రక్షా అని మార్చుకుంది. విక్రమ్ హీరోగా వచ్చిన చిరునవ్వుల వరమిస్తావా.. అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. అనంతరం ఐటెం సాంగ్స్‌లో మెరిసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..