
ఇప్పటివరకు ఇండస్ట్రీ ప్రేమకథలో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వే కావాలి సినిమా ఒకటి. 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయిత. కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో తరుణ్, రిచా హీరో హీరోయిన్ గా నటించారు. అప్పటి వరకు బాల నటుడిగా నటించి మెప్పించిన తరుణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి మలయాళీ మాతృకయైన నిరం చూసినప్పటి నుండి అలాంటి సినిమా తెలుగులో కూడా చేస్తే బాగుంటుందని రవికిషోర్ అనుకున్నాడు. దర్శకుడు కె. విజయభాస్కర్ ను సంప్రదించి తన ఆలోచన చెప్పాడు. తర్వాత రవికిషోర్, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్ లు ముగ్గురూ కలిసి మళ్ళీ ఆ సినిమా చూసి స్క్రిప్టు తయారు చేశారు.
తెలుగు వర్షన్ కు చాలా మార్పులు చేశారు త్రివిక్రమ్. అలాగే అద్భుతమైన సంభాషణలు కూడా రచించారు. రవికిషోర్ పనితనం మీద నమ్మకం ఉన్న రామోజీరావు తెలుగు స్క్రిప్టు పూర్తిగా చూడకుండగానే నిర్మాతగా ఉండటానికి అంగీకరించారట. ముందుగా ఈ సినిమాకు హీరోగా మహేష్ అనుకున్నారట. దీని ఒరిజినల్ నేరం సినిమాను మహేష్ కు పంపించారట.. కానీ మహేష్ రెస్పాన్స్ అవ్వకపోవడంతో.. సుమంత్ ను అనుకున్నారట.
కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. దాంతో సుమంత్ ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు. దాంతో ఈ సినిమా ఛాన్స్ తరుణ్ కు దక్కింది. హీరోగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు తరుణ్.