
చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధిస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలేకాదు.. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలే వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కొత్త హీరో, కొత్త దర్శకుడితో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కథ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాపై చాలా ప్రేమను కురిపిస్తారు. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. 2023 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా అప్పట్లోనే భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ ట్యాగ్‌ను సంపాదించింది. ఇక ఇప్పుడు ఓటీటీ సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ చిత్రమేంటో తెలుసా.. ?
అదే ‘ది కేరళ స్టోరీ’. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను కేవలం రూ.15 కోట్లతో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. కేరళలోని హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి ఆ తరువాత ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చుకోవడం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేరళలోని ఒక కళాశాలలో నర్సు కావాలనే కలతో అడ్మిషన్ తీసుకునే షాలిని ఉన్నికృష్ణన్ (ఆదా శర్మ) అనే హిందూ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.
అక్కడ ఆమెకు ఆసిఫా, గీత, నీమా అనే ముగ్గురు అమ్మాయిలతో స్నేహం ఏర్పడుతుంది. మొదటి నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత షాలినికి బ్రెయిన్ వాష్ జరుగుతుంది. ప్రేమ పేరుతో అమ్మాయినిషాలిని ఫాతిమాగా పేరు మార్చుకుని ఉగ్రవాదిని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమెను మోసగించి సిరియాకు బలవంతంగా పంపిస్తారు. దీంతో ఆమె జీవితంలో ఎదురైన పరిస్థితులు, చివరకు ఆ ఉగ్రవాదుల నుంచి ఎలా తప్పించుకుంది? అనేది సినిమా. 2023లో ఈ సినిమా విడుదలైనప్పడు అనేక వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు సంపాదించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో ఆదా శర్మతోపాటు యోగితా బిహానీ, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, ప్రణయ్ పచౌరి, ప్రియదర్శిని, ప్రణవ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి