Tollywood: ప్రభాస్‌తో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే?

'మిర్చి' సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ మీకు గుర్తుండే ఉండొచ్చు. ఆ సినిమాలో..

Tollywood: ప్రభాస్‌తో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే?
Tollywood

Updated on: Jan 19, 2023 | 1:42 PM

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ మీకు గుర్తుండే ఉండొచ్చు. ఆ సినిమాలో మరో హీరోయిన్ అనుష్కతో పోటీపడి మరీ నటించింది. 2010లో ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తన అందం, అభినయంతో మొదటి సినిమాకే ఫ్యాన్ బేస్‌ను అమాంతం పెంచేసుకుంది. ఆ తర్వాత ‘నాగవల్లి’ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ‘మిరపకాయ్’ సినిమాతో మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అందుకుంది.

ఇక అనంతరం 2011లో కోలీవుడ్‌లోకి ‘మయక్కం ఎన్న’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ వెంటనే ‘ఒస్తే’ చిత్రంలో నటించింది. అయితేనేం ఈ రెండు సినిమాలు ఆమెకి ఆ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయాయి. మళ్లీ 2012లో ‘సారొచ్చారు’లో నటించిన రిచా.. నెక్స్ట్ ప్రభాస్‌తో ‘మిర్చి’ సినిమా చేసే సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో రిచాకు ‘భాయ్’ ఆఖరి చిత్రం. 2013లో సినీ ఇండస్ట్రీని విడిచిపెట్టి అమెరికా వెళ్లిపోయింది ఈ నటి. 2017 మేలో ఎంబీఏ డిగ్రీలో పట్టా సాధించింది. అంతేకాదు అదే సంవత్సరం తన బిజినెస్ స్కూల్ కొలీగ్ అయిన జో లంగేల్లాతో ఏడడుగులు నడించింది. ఇప్పుడు ఈ కపుల్‌కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం పోర్ట్‌ల్యాండ్‌లో ఒరెగాన్‌లో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది రిచా.