M S Narayana: చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం.

|

Jun 26, 2024 | 6:25 PM

తెలుగు సినిమా చరిత్రలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తర్వాత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఎమ్మెస్ నారాయణ.  చాలా మంచి పాత్రలను పోషించి అభిమానులను ఆకట్టుకున్నారు ఈ కమెడియన్. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు ఎమ్మెస్. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశారు. ఆతర్వాత ఆయన సినిమాల్లోనే నటుడిగా కొన్ని పాత్రలు చేశారు.

M S Narayana: చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం.
Ms Narayana
Follow us on

ఎమ్మెస్ నారాయణ .. తన నటనతో నవ్వుల పువ్వులు పూయించారు ఈ దిగ్గజ నటుడు. ఎలాంటి పాత్ర అయినా తనదైన శైలిలో కామెడీ పండించి ప్రేక్షకులను అలరించారు ఎమ్మెస్ నారాయణ. తెలుగు సినిమా చరిత్రలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తర్వాత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఎమ్మెస్ నారాయణ.  చాలా మంచి పాత్రలను పోషించి అభిమానులను ఆకట్టుకున్నారు ఈ కమెడియన్. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు ఎమ్మెస్. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశారు. ఆతర్వాత ఆయన సినిమాల్లోనే నటుడిగా కొన్ని పాత్రలు చేశారు. ఆ తర్వాత మా నాన్నకు మళ్లీ పెళ్లి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుకున్నారు. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎమ్మెస్ నారాయణ.

శ్రీను వైట్ల సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.  దుబాయ్ శీను, దూకుడు సినిమాల్లో ఆయన నటన థియేటర్స్ లో నవ్వులు పూయించింది. కాగా అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు నారాయణ. ఎప్పుడైతే అనారోగ్యంతో ఆయన హాస్పటల్ లో చేరారో అప్పుడే అభిమానులకు ఆయన చివరి దశలో ఉన్నారని అర్ధమైపోయింది. హాస్పటల్ లో చేరిన ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక ఎదో తెలుసా.?

హాస్పటల్ లో చేరిన ఎమ్మెస్ నారాయణ చనిపోయే రెండు గంటల ముందు ఒక పేపర్ పై “బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది” అని రాశారట. దాంతో ఎమ్మెస్ నారాయణ కూతురు వెంటనే బ్రహ్మానందంకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందట. దాంతో ఆయన హాస్పటల్ కు పరుగు పరుగున వెళ్లారట. అయితే  బ్రహ్మానందంకు ఎమ్మెస్ నారాయణ చెవిలో ఎదో చెప్పే ప్రయత్నం చేశారట. కానీ అది ఆయనకు అంతగా అర్ధం కాలేదట. బ్రహ్మానందం చేయి గట్టిగా పట్టుకుని అన్నయ్య అని పిలిచాడు. ఆ స్థితిలో ఎమ్మెస్ ను చూడలేక బ్రహ్మానందం బయటకు వచ్చేశారట.. ఆయన వచ్చిన తర్వాత 15 నిమిషాలకే ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారని ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం చెప్పి చాలా బాధపడ్డారు. నిర్జీవంగా పడిఉన్న తన తమ్ముడిని చూసి బ్రహ్మానందం గుండె బద్దలయ్యేలా విలపించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..