
టాలీవుడ్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం (డిసెంబర్ 1)న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమంత -రాజ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సామ్- రాజ్ ల భూత శుద్ది పద్దతిలో జరిగినట్టు ఈషా ఫౌండేషన్ కూడా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో ఈ భూత శుద్ధ పద్దతి అంటే ఏంటీ? అని అందరూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆచారం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
‘భూత’ అంటే పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం), ‘శుద్ధి’ అంటే శుద్ధి చేయడం. ఈ క్రియద్వారా దంపతుల శరీరంలో పంచభూతాలను శుద్ధి చేసి, మానసిక-భౌతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం. భూతశుద్ధి వివాహమనేది ఏ కులానికి, ఏ మతానికి పరిమితం కాదు. లింగ భైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానాన్ని ఎంచుకుంటారు. రెండో వివాహాలూ కూడా ఈ పద్ధతిలో జరుపుకోవచ్చు. సమంత -రాజ్ లా గతంలో చాలా మంది ఇదే భూత శుద్ధ పద్దతిలో వివాహం చేసుకున్నారు.
సమంత–రాజ్ కంటే బాలీవుడ్ బుల్లితెర జంట వరుణ్ జైన్-గియో మానిక్ జంట ‘భూత శుద్ధి వివాహం’ చేసుకుంది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య కూడా ఈ పద్దతిలోనే పెళ్లి చేసుకున్నాడట. గతేడాది అంకిత్ పెళ్లి జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే. యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ అల్బంతో గుర్తింపు తెచ్చుకున్నాడు అంకిత్ కొయ్య.‘తిమ్మరుసు’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘సత్యభామ’ తదితర సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు. ఇక ‘మారుతి నగర్ సుబ్రమణ్యం‘ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఆయ్ సినిమాలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఈ ఏడాది బ్యూటీ చిత్రంతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు అంకిత్ కొయ్య.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.