
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నవీన్ చంద్ర విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్, నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేశ్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీలీల హుషారైన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అలాగే రవితేజ- శ్రీలీల కాంబినేషన్ సీన్స్ కు కూడా చప్పట్లు పడ్డాయి. కాగా గతంలో ధమాకా సినిమాలోనూ హీరో, హీరోయిన్లుగా నటించారు రవితేజ, శ్రీలీల. ఈ సినిమా ఏకంగా వందకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మాస్ జాతర ఆ రేంజ్ లో లేకపోయినా వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
అయితే మాస్ జాతర సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రీలీల మొదటి ఛాయిస్ కాదట. మహానటి కీర్తి సురేష్ ని హీరోయిన్‌గా అనుకున్నారట. డైరెక్టర్ భాను భోగవరపు కూడా కీర్తికి కథ వినిపించారట. ఆమెకు కూడా కథ నచ్చిందట. అయితే అప్పటికే కీర్తీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉండడంతో మాస్ జాతర సినిమాను వదులుకుందట. దీంతో మేకర్స్ శ్రీలీలను తీసుకున్నారట. అలా ధమాకా తర్వాత మరోసారి రవితేజ-శ్రీలీల జోడీ కట్టారట. అయితే శ్రీలీల ప్లేస్ లో కీర్తి సురేష్ చేసి ఉంటే మాస్ జాతరకు ప్లస్ అయ్యేదా? మైనస్ అయ్యేదా? అని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.
Mass beats, energetic dance bangers, and heartful melody — all packed into the powerful 🔥 #MassJathara Audio Jukebox🎶, Out now on @adityamusic!
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/Lu3V1V7NEv
— Aditya Music (@adityamusic) November 12, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి