The Girlfriend: గోల్డెన్ ఛాన్స్ మిస్.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ ఇందులో హీరో పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. అందుకే ఇప్పుడు దీక్షిత్ శెట్టి పేరు మళ్లీ వినిపిస్తోంది

The Girlfriend: గోల్డెన్ ఛాన్స్ మిస్.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Rashmika Mandanna The Girlfriend Movie

Updated on: Nov 10, 2025 | 9:51 PM

ఇటీవలే థామా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ లభించింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక నటన హైలెట్ అని ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ హీరో దీక్షిత్ శెట్టి తన నటనతో ఆడియెన్స్ ను మంత్ర ముగ్ధులను చేశాడని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మికతో అతని కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని అతని పాత్రలో చాలా ఎమోషన్స్ దాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి పేరు కూడా మార్మోగిపోతోంది. దసరా సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దీక్షిత్. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ హీరో.

ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి మొదటి ఛాయిస్ కాదట. విక్రమ్ పాత్ర కోసం మొదట నాగశౌర్యను అనుకున్నారట. అతనికి కథ కూడా వినిపించారట. నాగ శౌర్యకు కూడా కథ బాగా నచ్చిందట. అయితే అప్పటికే ఈ హీరో చేతిలో మూడు సినిమాలున్నాయట. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమైపోయిందట. దీంతో ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాను వదలుకున్నాడట. దీంతో ఆ పాత్రను దీక్షిత్ శెట్టికి ఆఫర్ చేయగా, అతను దాన్ని చాన్స్‌గా తీసుకుని అద్భుతంగా నటించాడట. అయితే దీక్షిత్ శెట్టి బదులు విక్రమ్ పాత్రను నాగశౌర్య చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నాగశౌర్య-రష్మిక కాంబినేషన్ లో ఛలో అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సెట్ లో రష్మిక, దీక్షిత్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి