AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murali Sharma: ఏంటీ.. ఈ టాలీవుడ్ విలన్ భార్య తెలుగులో స్టార్ హీరోయినా.. ? ఎవరో తెలిస్తే నోరెళ్లాబెట్టాల్సిందే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సహయ నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో మురళీ శర్మ ఒకరు. ఈ పేర చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ భలే భలే మగాడివోయ్ సినిమాలో లావణ్య త్రిపాఠి తండ్రి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

Murali Sharma: ఏంటీ.. ఈ టాలీవుడ్ విలన్ భార్య తెలుగులో స్టార్ హీరోయినా.. ? ఎవరో తెలిస్తే నోరెళ్లాబెట్టాల్సిందే..
Murali Sharma
Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 9:26 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. విలన్ పాత్రలోనైనా లేదా మనసులను కదిలించే తండ్రి పాత్రలోనైనా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటివరకు ఎన్నో అద్భుమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా తెలుగులో పాపులర్ అయ్యాడు. తండ్రి పాత్రలలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో.. న్యాచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రాలతో ఆయన నటనకు ప్రశంసలు వచ్చాయి. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మొదలైన ఆయన సినీ ప్రయాణం.. ఆ తర్వాత హిందీలో నెమ్మదిగా సినిమా అవకాశాలు అందుకున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన మైహునా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.

కానీ ఎక్కువగా తెలుగులోనే పాపులర్ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మురళీశర్మ వ్యక్తిగత విషయాలు ఎవరికి అంతగా తెలియదు. కానీ మీకు తెలుసా.. ఆయన భార్య ఫేమస్ హీరోయిన్. హిందీలో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ తెలుగులో మాత్రం ఆమె తోపు విలన్. పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆమె పేరు అశ్వినీ కల్ శేఖర్.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

అల్లు అర్జున్, తమన్నా కలిసి నటించిన బద్రినాథ్ చిత్రంలో విలన్ సర్కార్ భార్యగా నటించింది. ముఖ్యంగా ఒక్కసారి అత్తా అని పిలవవే అంటూ తమన్నాతో ఆమె చెప్పే డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో ఆమెకు ఓవర్ నైట్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో అంతగా నటించలేదు. కానీ హిందీలో సీరియల్స్, సినిమాల ద్వారా బిజీగా ఉంటుంది. రవితేజ నటించిన నిప్పు, ఆకాష్ పూరి నటించిన మెహబూబా వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

Murali Sharma Wife

Murali Sharma Wife

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Follow Us
మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే జైలుకే..!
మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే జైలుకే..!
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. రేపు దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్‌లు బంద్!
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. రేపు దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్‌లు బంద్!
ఆ హీరోయిన్ ఈ విలన్ భార్యనా.. ? ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్..
ఆ హీరోయిన్ ఈ విలన్ భార్యనా.. ? ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్..
ఏపీ లాసెట్‌ 2026లో 'టాప్‌' లేపిన తిరుపతి కుర్రోడు..
ఏపీ లాసెట్‌ 2026లో 'టాప్‌' లేపిన తిరుపతి కుర్రోడు..
ఆరేళ్ల చిన్నారి ఊపిరి తీసిన కన్నతల్లి పైశాచికం!
ఆరేళ్ల చిన్నారి ఊపిరి తీసిన కన్నతల్లి పైశాచికం!
చనిపోయిన సోదరి జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టించిన హైదరాబాద్ హీరో
చనిపోయిన సోదరి జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టించిన హైదరాబాద్ హీరో
ఇక 'గ్రామకంఠం' ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్ ఈజీ..!
ఇక 'గ్రామకంఠం' ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్ ఈజీ..!
ఇది తెలుసా? AC ఎన్ని గంటలు నడిచిన తర్వాత విశ్రాంతి ఇవ్వాలి?
ఇది తెలుసా? AC ఎన్ని గంటలు నడిచిన తర్వాత విశ్రాంతి ఇవ్వాలి?
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. ఆ టైంలో అస్సలు బయటకటి రావొద్దు
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. ఆ టైంలో అస్సలు బయటకటి రావొద్దు
చెపాక్‌లో ధోనీ కన్నీటి వీడ్కోలు.. ఫ్యాన్స్ గుండె బరువెక్కే సీన్
చెపాక్‌లో ధోనీ కన్నీటి వీడ్కోలు.. ఫ్యాన్స్ గుండె బరువెక్కే సీన్