
దక్షిణ భారత సినిమా చరిత్రలో మరపురాని జంట ఇది. ఆ ఇద్దరు కలిసి ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించారు. వీరి కాంబోలో ఏకంగా 130 సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. అందులో 50 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో ఈ జంట సినీచరిత్రలోనే గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఈ ఇద్దరు నటీనటులు ఎవరో తెలుసా.. ?ఆమె మరెవరో కాదు.. చంద్రముఖి సినిమాలో అఖిలాండేశ్వరి పాత్రలో నటించిన షీలా సీలిన్ అకా షీలా. ఆమె ఒక మలయాళ నటి. ఇక ఆమెతో కలిసి నటించిన నటుడు ప్రేమ్ నజీర్. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అప్పట్లో ఇద్దరు కలిసి 130 చిత్రాలలో కలిసి నటించారు. కట్టుమైనా సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. 1963లో విడుదలైన ఈసినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చాలా సంవత్సరాలు పనిచేశారు. అందుకే వీరిద్దరి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. ఈ జంట నటించిన సెమ్మెయిన్, కల్లిచెల్లమ్మ, వెలుత కత్రినా వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్ సూపర్ హిట్స్.
షీలా మార్చి 24, 1948న జన్మించారు. 13 సంవత్సరాల వయసులో నటించడం ప్రారంభించారు. 17 సంవత్సరాల వయసులోనే 1962లో MGR తో కలిసి ‘పాసం’ అనే తమిళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తమిళంతోపాటు మలయాళం, తెలుగు, ఉర్దూ బాషలలో మొత్తం 475కి పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా మెప్పించారు. యక్షగానం, సికారంగల్ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు. ఆమె నాలుగు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ అవార్డును అందుకున్నారు. 1983 లో నటన నుండి రిటైర్ అయిన తర్వాత, షీలా ఊటీలో సెటిల్ అయ్యారు.
Sheela Celine
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..