
ప్రస్తుతం బుల్లితెరపై టాప్ టీఆర్పీతో దూసుకుపోతోన్న సీరియల్స్ లో కార్తీక దీపం 2 కూడా ఒకటి. రాత్రి 7:30 అయిందంటే చాలు.. మహిళలందరూ ఈ సీరియల్ చూడడం కోసం టీవీ ముందు వాలిపోతారు. అంతలా బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది కార్తీక దీపం సీరియల్. ఇందులో డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరూపమ్, వంటలక్క పాత్రలో యాక్ట్ చేసిన ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. మొదటి పార్ట్ లో లేదు కానీ.. కార్తీక దీపం పార్ట్ 2 సీజన్ లో ఒక సరికొత్త క్యారెక్టర్ వచ్చింది. అదే కార్తీక్ తండ్రి పాత్ర. ప్రముఖ నటుడు జీడిగంటు శ్రీధర్ ఈ రోల్ లో ఒదిగిపోయారు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు ఇప్పుడు శ్రీధర్ యాక్టింగ్ ను కూడా బుల్లితెర ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా శ్రీధర్ మరెవరో కాదు ప్రముఖ నవలా రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి తనయుడు.
పలు సినిమాలు, సీరియల్స్ కు స్క్రిప్ట్స్ అందించారాయన. ఇక శ్రీధర్ కుమారుడు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్నాడు. అలాగే కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది.
జీడిగుంట శ్రీధర్ కుమారుడు మరెవరో కాదు వరుణ్ సందేశ్. సొంత కుమారుడు కాదు కానీ.. శ్రీధర్ విజయసారథి తనయుడే వరుణ్ సందేష్. హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. అయితే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు ట్రై చేస్తున్నాడు. త్వరలోనే నయనం అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు వరుణ్ సందేశ్. ఇక శ్రీధర్ కూతురు వీణా సాహితి పాటల రచయిత్రి. ‘అలా మొదలైంది’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిందామె.
వరుణ్ సందేశ్ ఫ్యామిలీ ఫంక్షన్లలో తరచూ కనిపిస్తుంటారు శ్రీధర్. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..