
సినిమాలన్నాక అందరికీ సక్సెస్ లు, ఫ్లాపులు ఉంటాయి. హీరోకైనా, డైరెక్టర్ కైనా ఇవి కామనే. అయితే టాలీవుడ్ లో ది గ్రేట్ రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేంటంటే ఆయన ది మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. జక్కన్న ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్ ఉన్నాయి. అయితే ది గ్రేట్ రాజమౌళి లాగే టాలీవుడ్ లో అపజయమెరుని వ్యక్తి మరొకరు ఉన్నారు. అతను ఇప్పటివరకు 8 సినిమాలు చేశాడు. అన్నీ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అంటే 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నమాట. ఈ కారణంగానే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి. ఆదివారం (నవంబర్ 23) ఈ డైరెక్టర్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అనిల్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో ఈ టాలీవుడ్ డైరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ రామ్.. ఇలా ఎందరో స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు తీశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరో హిట్టు కొట్టేందుకు రెడీ అయ్యాడు. అతను తెరకెక్కిస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఈ మెగా మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన అనిల్ రావి పూడి తన తండ్రి గురిం చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘ మా నాన్న ఒక ఆర్టీసీ డ్రైవర్. నెలకు నాలుగు వేల రూపాయల జీతం. నాకు ఎంసెట్ లో 8000 ర్యాంక్ వచ్చింది. ఒక మంచి కాలేజీలో పేమెంట్ సీట్ తీసుకుని నన్ను బాగా చదివించాడు. ఇందుకోసం ఏడాదికి 45 వేలకు పైగా ఖర్చు పెట్టేవాడు. నెలకు 4 వేల రూపాయల జీతం తీసుకునేవాడికి ఇది చాలా ఎక్కువ. నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఇది ఏ మాత్రం సరిపోదు. అయినా నా చదువు కోసం లోన్లు తీసుకున్నాడు. వాటిని తీర్చడానికి చాలా కష్టపడాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనల్ని చదివించడానికో, మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఫోర్స్ ఉంటుంది. వారే మన పేరెంట్స్. వారి కష్టం గురించి తెలుసుకుంటే మనం జీవితంలో తప్పు చేయం’ అని ఎమోషనల్ అయ్యాడు అనిల్ రావిపూడి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి