
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అతడు మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరు. అంతేకాదు.. 59 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకే పోటీ ఇస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? సినీ కెరీర్ స్టార్ట్ చేస్తున్న తొలి నాళ్లల్లోనే అతడు పెద్ద ప్రమాదానికి గురయ్యాడు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఆ ప్రమాదంలో అతడి కాలు విరిగింది. పాదం నుంచి మోకాలి వరకు అతడి కాలు తీవ్రంగా గాయపడింది. దీంతో కాలు తీసేయాలని సూచించారు వైద్యులు. అప్పుడు అతడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. తన స్నేహితుడితో కలిసి సరదాగా బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాలు తీసేయాలని వైద్యులు చెప్పడంతో ఆత్మవిశ్వాసంతో తిరిగి కోలుకోవడానికి ప్రయత్నించారు. తన కాలును రక్షించుకోవడానికి ఏకంగా 23 సర్జరీలు చేయించుకున్నారు. అలాగే మూడేళ్లపాటు మంచానికే పరిమితమయ్యాడు. మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకు నిత్యం తనను తాను మోటివేట్ చేసుకుంటూ.. చివరకు నటుడు కావాలనే తన సంకల్పాన్ని నిజం చేసుకున్నాడు. అతడు మరెవరో కాదు. చియాన్ విక్రమ్.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. కెరీర్ మొదట్లో చాలా అడిషన్స్ ఇచ్చాడు. కొన్ని చిత్రాలకు సహాయ పాత్రలు పోషించాడు. ఆ తర్వాత వాయిస్ యాక్టర్ గా కూడా నటించాడు. ఇప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన కొడుకుతోపాటు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..