Tollywood : ఐశ్వర్య రాయ్‏తో లవ్, బ్రేకప్.. పదేళ్లలో రూ.358 కోట్లు విరాళం.. ఈహీరో ఎవరంటే..

సినిమాల్లో నటించడానికి ముందే అతడు వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. కానీ అప్పటికీ అతడి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అదే వయసులో అతడు ఏకంగా రూ.19 కోట్లు సంపాదించాడు. గత పదేళ్లలో రూ.358 కోట్లు విరాళం ఇచ్చాడు. హీరోగా సక్సెస్ కాకపోయినా విలన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywood : ఐశ్వర్య రాయ్‏తో లవ్, బ్రేకప్.. పదేళ్లలో రూ.358 కోట్లు విరాళం.. ఈహీరో ఎవరంటే..
Aishwarya Rai

Updated on: Nov 23, 2025 | 6:50 PM

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న నటుడు.. చిన్న వయసులోనే తెరంగేట్రం చేశాడు. హీరోగా సూపర్ హిట్ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమ, బ్రేకప్.. ఆ తర్వాత కోపం ఊహించని పరిస్థితుల్లోకి నెట్టాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ కావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు అతడు సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. అంతేకాదు.. కేవలం 16 ఏళ్ల వయసులో రూ.1 కోటి సంపాదన.. 19 ఏళ్ల వయసులోనే అతడు రూ.12 కోట్లు సంపాదించారు. అతడు మరెవరో కాదు.. వివేక్ ఒబెరాయ్.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఐశ్వర్య రాయ్ తో ప్రేమ, బ్రేకప్ అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఇప్పుడు అతడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నాడు. కంపెనీ సినిమాతో హీరోగా పరిచయమైన అతడు..రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. వివేక్ ప్రముఖ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు. తన తండ్రి అడుగుజాడల్లోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. సాదియా, యువ, ఓంకార వంటి చిత్రాల్లో నటించాడు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2003లో విలేకరుల సమావేశంలో అతడు జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సల్మాన్, ఐశ్వర్య బ్రేకప్ తర్వాత వివేక్ తో ఐశ్వర్య ప్రేమలో పడిందని రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో వివేక్ ప్రెస్ మీట్ నిర్వహించి .. సల్మాన్ ఖాన్ తనను బెదిరించాడని చెప్పాడు. అదే సమయంలో సల్మాన్ పై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో అతడికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు 3 ఏళ్లపాటు ఏ సినిమాలోనూ నటించలేదు.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం వ్యాపారంపై దృష్టిపెట్టాడు. వివేక్ 19 ఏళ్ల వయసులో సినిమాల్లోకి రాకముందు ఒక స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీని ప్రారంభించి దాదాపు 12 కోట్లు సంపాదించాడు. 23 సంవత్సరాల వయసులో ఆ కంపెనీని విక్రయించి అనేక కోట్లు సంపాదించారట. ప్రస్తుతం వివేక్.. రియల్ ఎస్టేట్, వినోదం, ఫైనాన్స్‌లలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్ లో అతడి కంపెనీ విలువ 7 బిలియన్ డాలర్లు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.1200 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అలాగే దాదాపు పదేళ్లలో అతడు భారీగా విరాళాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..