అమ్మబాబోయ్.. అరుంధతి నటి కూతుర్ని చూశారా.? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ అరుంధతి. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2009లో విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ చిత్రానికి అవార్డులు, రివార్డులు దక్కాయి. మొత్తం ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను అందించింది.

అమ్మబాబోయ్.. అరుంధతి నటి కూతుర్ని చూశారా.? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
Arundathi

Updated on: Feb 26, 2025 | 12:49 PM

చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటారు. సినిమాలో కనిపించేది కొంతసేపు అయినా ఉన్నంతలో తమ పాత్రకు న్యాయం చేస్తూ ఉంటారు. పెద్దగా గుర్తింపు దక్కకపోయినా.. తమ పాత్రతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో సుభాషిణి ఒకరు. ఈమె పేరు చెప్తే పెద్దగా ఆడియన్స్ గుర్తుపట్టకపోవొచ్చు కానీ ఆమెను చూస్తే .. ఓహో ఈమేనా అనుకుంటారు. పేరుతో కంటే తన నటనతోనే ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయ్యారు సుభాషిణి, ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాషిణి.

హీరో, హీరోయిన్స్ కు అక్కగా, వదినగా నటించి మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాలు చేశారు సుభాషిణి జయసుధ సిస్టర్ అవుతారు. ఇక అరుంధతి సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమాలో సుభాషిణి నటించారు. ఈ మూవీలో విలన్ గా నటించిన సోనూ సూద్ తల్లిగా ఆమె ప్రేక్షకులను భయపెట్టారు.

ముఖ్యంగా అరుంధతి సినిమాలో సోనూ సూద్ ను సమాధి నుంచి బయటకు రప్పించాలని ఆమె చేసే ప్రయత్నాలు.. ఆమె బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు వణుకు పుట్టించాయి. ఇక ఆమె కూతురు గురించి చాలా మందికి తెలిసి ఉండదు. సుభాషిణి కూతురు పేరు పూజా ఆమె పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ నటించిన 143 సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ అవ్వలేకపోవడంతో పూజకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత ఆమె సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి