
భారతీయ సినిమా ప్రపంచంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇటీవలే గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తమిళంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కండక్టర్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. రజినీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్, స్వాగ్, మేనరిజం అంటే ప్రేక్షకులకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. రజినీ కెరీర్ లో ఆయనకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? అంతేకాదు.. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా.
నటుడిగా తనకంటూ గుర్తింపు కోసం రజినీ చెన్నైకి వచ్చిన సమయం అది. అప్పుడప్పుడే అవకాశాలు అందుకుంటూ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంలో నటించే అవకాశాన్ని పొందారు. ఈ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. రజనీకాంత్ నటించిన హిట్ చిత్రాలలో ఒకటి ‘మూండు ముడిచ్చు’ ఒకటి.
1976లో విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్, కమల్ పలువురు ప్రముఖులు నటించారు. ఇందులో శ్రీదేవి పాత్ర చాలా ముఖ్యమైనది. శ్రీదేవి ఒక వృద్ధుడిని వివాహం చేసుకున్న 25 ఏళ్ల మహిళ పాత్రను పోషించింది. ఇందులో రజనీకాంత్ ఆ వృద్ధుడి కొడుకు పాత్రను పోషించారు. ఈ చిత్రంలో శ్రీదేవి కొడుకుగా కనిపించారు రజినీ. అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. శ్రీదేవి-రజనీ కలిసి 16 వయతినిలే, జానీ, అదాలత్ వారిసు, రాను వీరన్, ఆడు పులి ఆటం, పోక్కిరి రాజా వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు.
Rajini
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..