AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ మేనేజర్, బాడీగార్డ్ జీతాలు తెలిస్తే షాకే.. సంవత్సరానికి కోట్లలో..

షారుఖ్ బర్త్ డే సందర్భంగా డుంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‏కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. దేశంలో అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మేనేజర్, బాడీగార్డ్ జీతాలకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ ఇద్దరి ఆయన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు. వారే షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ, బాడీగార్డ్ రవిసింగ్.. 2012 నుంచి షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అంతర్భాగంగా ఉన్న పూజా దద్లానీ.. ఆయన కెరీర్ కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ మేనేజర్, బాడీగార్డ్ జీతాలు తెలిస్తే షాకే.. సంవత్సరానికి కోట్లలో..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2023 | 7:52 PM

Share

షారుఖ్ ఖాన్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకే బాద్ షా అయ్యారు. ఈరోజు షారుఖ్ 58వ పుట్టినరోజు. ఇప్పటికే ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రెటీలు బాద్ షా బర్త్ డే సెలబ్రెషన్స్ తెలుపుతున్నారు. మరోవైపు షారుఖ్ బర్త్ డే సందర్భంగా డుంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‏కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. దేశంలో అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మేనేజర్, బాడీగార్డ్ జీతాలకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ ఇద్దరి ఆయన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు. వారే షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ, బాడీగార్డ్ రవిసింగ్.. 2012 నుంచి షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అంతర్భాగంగా ఉన్న పూజా దద్లానీ.. ఆయన కెరీర్ కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కేవలం మేనేజర్ మాత్రమే కాదు షారుఖ్ కుటుంబంలో కీలక సభ్యురాలు. షారుఖ్ మూవీ షెడ్యూల్స్ చూసుకోవడమే కాకుండా.. ఆమె రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, IPL టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సహా SRK వ్యాపారాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అదనంగా.. ఆమె చట్టపరమైన విషయాలతో సహా కీలకమైన వృత్తిపరమైన వ్యవహారాలకు బాధ్యత వహిస్తుంది. పూజా దద్లానీ జీతం సంవత్సరానికి రూ. 7 నుంచి 9 కోట్లు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. షారుఖ్ వద్ద పూజా చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది.

Shah Rukh Khan Manager

Shah Rukh Khan Manager

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఇక బాడీగార్డ్ రవిసింగ్. ఒక దశాబ్ధ కాలంగా షారుఖ్ బాడీగార్డ్‌గా పనిచేస్తున్నాడు. SRKకి ఎప్పుడూ అప్రమత్తమైన కవచంగా నిలిచాడు. షారుఖ్ ఖాన్ భద్రతను నిర్ధారించడంలో అతని అంకితభావం, నిబద్ధత అతన్ని సెలబ్రిటీ బాడీగార్డ్ డొమైన్‌లో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా చేసింది. పలు నివేదికల ప్రకారం, రవి సింగ్ సంవత్సరానికి దాదాపు రూ. 3 కోట్లు తీసుకుంటున్నారట. పరిశ్రమలో అత్యధికంగా చెల్లించే సెలబ్రిటీ బాడీగార్డ్‌లలో ఒకరిగా రవిసింగ్ నిలిచాడు. అతడికి నెలకు రూ. 17 లక్షలు జీతం ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. షారుఖ్ నటించిన డుంకీ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కూడా నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us