
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మరోవైపు త్వరలోనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అయితే ప్రభాస్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా గుర్తుందా.. ? ఈశ్వర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 23 ఏళ్ల కిందట విడుదలైన ఈ మూవీలో నటుడిగా అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు ప్రభాస్. ఫస్ట్ మూవీతోనే మాస్ యాక్షన్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 2002లో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..
ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. అంతకు ముందు తెలుగులో రుక్మిణి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఈశ్వర్ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కెరీర్ ఫాంలో ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ఇదిలా ఉంటే.. శ్రీదేవి విజయ్ కుమార్ ఫ్యామిలీ మొత్తం సినీరంగానికి చెందినవారే. ఆమె తల్లిదండ్రులు విజయ్ కుమార్, మంజుల ఇద్దరు నటీనటులు కావడం విశేషం. అలాగే శ్రీదేవి అక్కాచెల్లెల్లు, అన్న సైతం నటులు కావడం గమనార్హం. శ్రీదేవి అన్నయ్య అరుణ్ విజయ్ సైతం స్టార్ హీరో. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు. అలాగే సాహో సినిమాలోనూ నటించాడు.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..