Actor Nani: నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా.. ? జగపతి టాక్ షోలో న్యాచురల్ స్టార్.. ప్రోమో చూశారా.. ?
న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ఉండే గురించి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన నాని.. ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే హాయ్ నాన్న సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొన్నారు. రెండు వారాల క్రితం మొదలైన ఈ టాక్ షోకి ముందుగా నాగార్జున అతిథిగా వచ్చారు. ఆ తర్వాత శ్రీలీల సైతం వచ్చారు. ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ కోసం న్యాచురల్ స్టార్ నాని వచ్చారు.ఇందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాని పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
తాజాగా విడుదలైన ప్రోమోలో.. మనం మొదటిసారి ఎప్పుడు కలిశాం గుర్తుందా నీకు ? అని జగపతి బాబు అడగ్గా.. మీక గుర్తుందా ? అని నాని రివర్స్ అడిగారు. దెబ్బతింది నేను కదా.. నాకు గుర్తుంటుంది అని జగపతి బాబు అనడంతో నాని ఆశ్చర్యపోయారు. అలాగే నాని చిన్నప్పటి స్నేహితుడిని తీసుకువచ్చి సర్ ప్రైజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పారు ? అని జగపతి బాబు అనడంతో నాని గట్టిగా నవ్వేశారు.ఈ విషయానికి నాని స్నేహితుడు ఆన్సర్ రివీల్ చేసేందుకు ట్రై చేశారు. ఎపిసోడ్ లో ఈ విషయంపై ఆన్సర్ ఇస్తారేమో చూడాలి. ఈ మూడో ఎపిసోడ్ ఈనెల 29న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నాని చివరగా హిట్ 3 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న ప్యారడైజ్ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..








